నేటి మొగ్గలే
రేపు పరిమళించే పువ్వులు
నేటి మొక్కలే
రేపటి పచ్చని వృక్షాలు
నేటి కన్యలే
రేపటి మాతృమూర్తులు
నేటి కూతుర్లే రేపటి కోడళ్ళు
నేటి కోడళ్ళే రేపటి అత్తలు
నేటి విద్యార్థులే
రేపటి భావిభారత పౌరులు
నేడు కలం పట్టి
కవితలు వ్రాసిన
ఔత్సాహిక కవివర్యులే...
రేపటి రచయితలు
గొప్ప సాహితీ శిఖరాలు
నేడు కాలినడకన
తిరిగిన వారే...రేపు సైకిల్ కొంటారు
నేడు సైకిల్ మీద తిరిగినవారే...
రేపు బైక్ పై తిరుగుతారు ఆపై కారులో
ఆపై విదేశాల్లో విమానాల్లో విహరిస్తారు
నేడు పొలంలో కూలోడే...
రేపు ఆ పొలానికి యజమాని
నేడు పొలంలో
ఎద్దులతో సేద్యం చేసినోడే...
రేపు ట్రాక్టర్లతో సేద్యం చేస్తాడు
ఇది కదా అభివృద్ధి అంటే...
ఇది కదా వ్యక్తిత్వ వికాసమంటే...
ఇది కదా కథ కంచికి చేరడమంటే...
ఇది కదా పూర్వజన్మ పుణ్యఫలమంటే...
ఇది కదా భగవంతుని వరప్రసాదమంటే...
ఇది కదా మనిషి మనీషిగా మారడమంటే...
ఉన్నస్థితి నుండి ఉన్నతస్థితికి చేరడమంటే.



