వ్యక్తి రూపం...శక్తి శాపం...?
కొందరు
ఎంత మంచి పని చేసినా
ఎన్ని మంచిమాటలు చెప్పినా
ఆ మంచిలోనే ఏదో చెడు ఉందని
ఊహిస్తారు కాగడా పట్టి వెదుకుతారు
కొందర్ని నీతిగా
నిజాయితీగా ఉండమని
నిప్పులా బ్రతకమని
నిజాలు చెబుతూ వుంటే
మీపైనే నిందలు వేస్తారు
మిమ్మల్ని నీచంగా హీనంగా చూస్తారు
కొందరు కిటికీలో నుండి
గుభాళించే గులాబీ పూలనుచూస్తే
కొందరు గులాబీ ముళ్ళను చూస్తారు కొందరు కిటికీలో నుండి
కొలనులో విరిసిన కమలాన్ని చూస్తే
కొందరు ఆ కమలం
కిందున్న బురదను చూస్తారు
కొందరు చూసి
రమ్మంటే కాల్చి వస్తారు
కొందరు ఎదుటివారిలో
ఎప్పుడూ ఏవేవో తప్పులు
భూతద్దాలతో వెదుకుతూ ఉంటారు
పచ్చకామెర్ల రోగికి
ప్రపంచమంతా పచ్చగానే కనిపిస్తుంది
నిజానికి ఇదే ఆవ్యక్తుల నిజ స్వరూపం
ఇదే ఆ వ్యక్తులకు ఏదో శక్తి పెట్టిన శాపం
ఇది వ్యక్తుల్లోలోపం కాదు దృష్టిలోలోపం



