Facebook Twitter
ఆరు వరాలు పొందాలంటే..?

ఆస్తి...
అందం...
అధికారం...
ఉన్నవారు...

ఆడే ప్రతి ఆటలో...
పాడే ప్రతి పాటలో ...
చెప్పే ప్రతి మాటలో...
వేసే ప్రతి అడుగులో...
చూసే ప్రతి చూపులో...
చేసే ప్రతి వాగ్దానంలో...
తీసుకునే ప్రతి నిర్ణయంలో...
"అహంకారం"...
అణువణువునా...
తొణికిసలాడుతుందట...!

ఆస్తి...
అందం...
అధికారం...
అహంకారమున్న వారిలో
"ఆనందం" ఆవగింజంతేనట..!

కానీ "ఆనందంగా" ఉన్నవారు
అందంగా ఆరోగ్యంగా ఉంటారట
వారికి ఆయుష్షు కూడా ఓ వరమేనట
పిల్లాపాపలతో నిండునూరేళ్లు వర్ధిల్లెదరట

అందుకే ఆస్తి...అందం...అధికారం...
ఆనందం...ఆరోగ్యం...ఆయుష్షను...
"ఆరు వరాలు"పొందాలంటే మనిషి
మనిషిలో మానవత్వం వికసించాలట..!
మనిషి గుండెల్లో ప్రేమ పొంగిపొర్లాలట..!
దైవత్వం అణువణువున ఆవహించాలట..! 

నరుడే నారాయణుడిగా అవతరించాలట..!