ఎత్తైన ఏడంంతస్తుల
విలాసవంతమైన
పాలరాతితో కట్టిన
ఇంద్రభవనంలాంటి ఇల్లు...
ఆ ఇంటిలో అందమైన
సుందరమైన మెత్తని
పరిమళించే పూలపాన్పు...
ఆ ఇంటి ముందర
అతి ఖరీదైన కారు...
ధరించే కోటు...
సూటు...బూటు...
ఇంటినిండా ఆర్జించిన
లక్షల కోట్ల కరెన్సీకట్టలు...
దోచుకొని
స్విస్ బ్యాంక్ లో
దాచుకున్న ధనం...
ఇంట్లో ఇనప్పెట్టెలో
ధగధగ మెరిసే నగలు...
బంగారు ఆభరణాలు...
పట్టుచీరెలు ఉన్నవారు కాదు...
విదేశాల్లో విమానాల్లో
విచ్చలవిడిగా
విహారం చేస్తూ...
ప్రతి నిత్యం
విందులు వినోదాలలో
మునిగితేలే వారు కాదు...
జీవితంలో...కష్టపడి
ఆర్జించిన సొమ్ములో
కొంత భార్యా బిడ్డలకు...
కొంత అభాగ్యులకు...
అనాథలకు నిరుపేదలకు...
కొంత దైవికకార్యాలకు పంచి...
సంపూర్ణమైన సంతృప్తితో
ప్రశాంతంగా...హాయిగా
ఆనందంగా...సంతోషంగా
నిశ్చింతగా నిద్రపోయేవారే...
కాళీ చేతులతో కాటికెళ్ళే వారే...
నిజమైన ధనవంతులు ఇలలో...
మీరేమంటారు మిత్రులారా..?
ఊ అంటారా..? ఊహూ అంటారా...?



