Facebook Twitter
కాలానికి మూడు కళ్ళు...?

కళ్ళకు కనిపించని
కాలచక్రభ్రమణాన్ని...
ఆగని కడలిలోని
అలల విన్యాసాన్ని
ఆపడం ఎవరితరం..?
ఆ కడలి...ఆ కాలం...మనిషికి
జీవిత పాఠాలు నేర్పే గురువులు

కాలం
చేస్తోంది ఇంద్రజాలం...
ఆడిస్తోంది బొమ్మలాట...
చేయిస్తుంది ఆకలి వేట...
చూపిస్తుంది బ్రతుకు బాట... 

కాలానికి మూడు కళ్ళు
నిన్న...నేడు...రేపు...
రేపు అగమ్య గోచరం...
వర్తమానం ఒక చక్కని వరం...
భవిష్యత్తు ఓ బంగారు ఆభరణం...

ప్రతి మనిషి ఓ ఆశాజీవి...
ఆశలు నెరవేరలేదని...
కోరిక కోర్కెలు తీరలేదని... 
నిరాశ నిస్రృహలకు గురికారాదు...
చీకటి గుహలో చిక్కుకుపోరాదు...

కనిపించని ఆ కాలాన్ని ఆ దైవాన్ని
ఆదుకోని ఆప్తులను నిందించరాదు...
ఆత్మవిశ్వాసం మనలో ఆవిరి కారాదు...

ఆశ ఒక మధురమైన ఊహ అది
రేపు నిర్మించబోయే ఓ ఇంద్రభవనం...
చేతికి అందబోయే ఓ అమృతఫలం...
కష్టేఫలి...కాలమే కలల కల్పతరువు...
కాలమే...మన భవిత భవన నిర్మాత...