విజయమా ? వీరస్వర్గమా...?
ఓ మనిషీ..!
అనంతమైన అఖండమైన
ఆత్మశక్తి నీలో దాగి ఉందని...
నీవు అసమర్థుడివి...అజ్ఞానివి...
అవివేకివి...బలహీనుడవు కాదని...
నీవొక బాహుబలివని...బలశాలివని...
నీ మనోఫలకంపై లిఖించుకో...
నేనేమీ చేయలేను...
నాకేమీ తెలియదన్న...
"పరమ పిరికిపదాలను"...
నీ నరంలేని నాలుకకు నేర్పకు...
వాటిని కలనైనా ఉచ్చరించకు...
ఓ మనిషీ..!
నాకు సర్వం తెలుసని...
నేవేదైనా చేయగలనని...
"ఆ పరమాత్మ"...
నా వాడని...నా నీడని...
నాకు తోడని గట్టిగా నమ్ము...
జయించడానికే
నేను జన్మించానని...
ఓటమి నా శత్రువని...
దాన్ని ఎదిరించి...
పోరాడి ఓడించి...
గెలుపు గుర్రమెక్కాలనుకో...



