పదిమందిని ప్రేమించి చూడు..!
ఓ మిత్రమా..!
నా ప్రియ నేస్తమా..!!
కంటికి
కనిపించే
అందరిని నీవు
కౌగిలించుకోకున్నా...
అందరిపై నీవు
కరుణను కురిపించకున్నా...
నీ హృదయం విప్పి
స్వచ్చమైన నీ ప్రేమను
ఓ పదిమందికి పంచిచూడు...
నిన్ను ప్రేమించే
100 మందిలో నీవు
10 మందిని తిరిగి ప్రేమిస్తే చాలు...
నిన్ను ద్వేషించే
"ఆ నలుగురి" గురించి
ఆలోచించే సమయం నీకెక్కడిది..?
రేపు వారే తమ తప్పును
తాము తెలుసుకుని తిరిగి
నీకు ప్రాణమిత్రులు కావొచ్చు...
కడవరకు నీకు తోడుండొచ్చు...
కాటివరకు నీకు తోడురావొచ్చు...ఆపై
నీలో ఏ అంతర్గతఘర్షణకు ఏ ఒత్తిడికి
ఏ ఆందోళనకు ఏ ఆవేదనకు తావుండదు
శత్రువులులేని మరణం ఒక గొప్ప వరమే...
ఇక నీ మనసంతా తరగని ప్రశాంతతే...
నీ బ్రతుకంతా వేకువలా ప్రకాశవంతమే...
ఇది సత్యం ఎవరూ కాదనలేని నగ్న సత్యం.



