Facebook Twitter
నడిరోడ్డులో నరమేధం ?

ఆప్ఘాన్
అధ్యక్ష భవనాన్ని ఆక్రమించేసి
అమాయకపు ప్రజలను
భయభ్రాంతులకు గురిచేస్తున్న
కఠిన శిక్షలు‌ వేస్తున్న
తప్పులు చేస్తే తలలు నరికేస్తున్న
తలపాగాలతో తిరుగుతున్న
తలపొగరు ఆ తాలిబాన్లు
పగబట్టిన త్రాచుపాములే

పాపం ప్రజలు
పులులు వేటాడే జింకల్లా
తోడేళ్ళు వెంటాడే మేకల్లా
చెల్లాచెదురైపోతున్నారు
పిల్లాపాపలతో ప్రాణభయంతో
పరుగులు ‌పెడుతున్నారు  
విమానరెక్కలకు వ్రేలాడుతున్నారు
పిట్టల్లా నేల రాలిపోతున్నారు
ప్రాణాలు కోల్పోతున్నారు
సమాధుల్లో‌ దాక్కోవడాని
సైతం సిద్ధపడుతున్నారు
ఎందుకు ? ఎందుకు ? ఎందుకు ?

కారణమొక్కటే
అదిగో నడిరోడ్డుపై ఆ నరమేధమే?
దయా దాక్షిణ్యం వారిలో శూన్యం
మంచితనం
మానవత్వం మటుమాయం
కళ్ళు మాత్రమే కనిపించే వాళ్ళు
మనుషులు ? కాదు మానవమృగాలు
ఇందరిని చంపి
ఇందరిని హింసించి
ఇందరి‌ రక్తాన్ని రుచి‌చూసి
ఇందరిని కన్నీళ్లకు గురిచేసి
ఇందరిని అష్టకష్టాల పాల్జేసి
ఇందరిని కన్నీళ్లకు గురిచేసి
ఇందరిని కన్నీళ్లకు గురిచేసి
ఆప్ఘాన్ పిల్లలబంగారు
భవిష్యత్తును భగ్నంచేసి
మానవతా విలువల్ని
మహిళా హక్కుల్ని కాలరాచి
వ్యతిరేకులందరిని బందీలనుచేసి
చిక్కినవారిని‌ చిత్రహింసలకు గురిచేసి 
ప్రజలరక్తాన్ని రుచిచూసి ప్రాణాలుతీసి
వారు పొందేది మోక్షమా ? కాదు కాదే
రాజ్యకాంక్షకు రాక్షసానందానికిది ప్రత్యక్షసాక్ష్యమే