Facebook Twitter
ఓటువిలువ ‌తెలుసుకోర ఓటరన్న...

నేడు‌ నేతలు ‌వొంగి వొంగి దండాలు
పెడుతుంటే ఓటర్లు పొంగి పొంగి పోతారు

రేపువారు  అధికారం దక్కగానే
కుర్చీఎక్కి కులుకుతారు కుబేరులౌతారు

రేపు ఈ అమాయకపు ఓటర్లే
ఆకలికి అలమటించే అస్థిపంజరాలౌతారు

ఓర్పు నశించిన ఓటర్లే మార్పు కోరేది
తలలుపండిన నేతల తలరాతలు మార్చేది

ఆగ్రహంతో ఓటర్లు ఉగ్రరూపం దాల్చితే
రెప్పపాటున రాజ్యాలు కుప్పకూలిపోతాయి

ఓటర్లూ మీ ఓటు విలువను మీరుతెలుసుకోండి
మీ వేలుతోనే మీ కంటిని మీరు పొడుచుకోకండి

మీ వేలుకు రాసిన సిరాచుక్కతో మీరు
అవినీతినేతలకు చుక్కలు చూపించవచ్చు

వారు కన్న‌ కలలను కల్లలు చేయవచ్చు
వారి జాతకాలను తారుమారు చేయవచ్చు

జరిగే ప్రతిఎన్నికల్లో మీరే గెలవాలి
ప్రజాశక్తికి మీరే ప్రతిరూపం కావాలి

ప్రజాస్వామ్యానికి మీరే పునాది వేయాలి
మీ చేతిలోని ఓటే మీకు వజ్రాయుధం కావాలి

మీరే అవినీతినేతల అంతుచూసి వారినిఉరితీయాలి
నీతిగలనేతల సుపరిపాలనకు మీరే ఊపిరి పోయాలి