Facebook Twitter
దైవాన్ని నిందించకు...ధైర్యాన్ని బంధించకు…

అప్పుడప్పుడు...
ఆశలు చిగురించినప్పుడు...
చిరునవ్వులు సిరిసంపదలు...
చిటపట చినుకుల్లా రాలతాయి...
అప్పుడు జీవితాలు కళ కళ లాడుతాయి...

నింగిలోని తారల్లా మిళ మిళ మెరుస్తాయి...

సుఖ సంతోషాలొచ్చినప్పుడు ఆనందించు
కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఆలోచించు
నిన్నటి కంటే నేడు బాగుండాలని భావించు  
అందంగా అద్భుతంగా ఉండాలని ఆశించు

పరిష్కారాలకై  ప్రయత్నించు...
సమస్యల సంకెళ్లు తెంచుకునేందుకు...
ప్రతినిత్యం ఆ పరమాత్మను ప్రార్థించు కానీ
దైవాన్ని నిందించకు...ధైర్యాన్ని బంధించకు

కొన్ని కష్టాలు నష్టాలు...
ఇబ్బందులు ఈతి బాధలు ...
వాగులై...వంకలై...వరదలై...వస్తాయి
సునామీలై...నిన్ను చుట్టుముడతాయి

నీ ఆశలు ఆవిరైపోతాయి
నీవుకన్న కలలన్నీ కన్నీటి వరదలౌతాయి
ఇదే మరి చీకటివెలుగుల...జీవితమంటే...
అందుకే చింతించకు...అందరి జీవితాలింతే