Facebook Twitter
నయ వంచకులను నమ్మకు ! నీవిలువైన ఓటును అమ్మకు!

అన్నా అన్నా! ఓటరన్నా !
ఓమంచిమాట చెబుతా వినరన్నా!
ముందు నీ శక్తి నీవు తెలుసుకో
నీ ఓటువిలువ నీవు తెలుసుకో

నీ ఓటుహక్కు నీ చేతిలో
ఒక పదునైన "ఆయుధమని"...
అది ప్రజాస్వామ్యానికి "ఊపిరిని"...
అది అన్ని అవినీతిరుగ్మతలకు
ఒక దివ్య "ఔషధమని"...

నీ ఓటుహక్కే నీకు
"అమృతభాండమని...
"అది కోహినూరు వజ్రమని"...
కోర్కెలు తీర్చే "కల్పవృక్షమని"...

నీ ఓటుహక్కే నీతిమంతులకు
ఒక "కీర్తికిరీటమని"...
అది కలుపు మొక్కలను
ఏరివేసేందుకు అరుదుగా
నీకు దక్కిన ఓ చక్కని "అవకాశమని"...
కలనైనా మరువకు...

అందుకే ఓ ఓటరన్నా !
నేతల ప్రలోభాలకు లొంగకు
నయవంచకులను....నమ్మకు
ఏ మందుకో ఏ మటన్ బిర్యానీకో
ఏ నోటుకో నీవిలువైన ఓటును...అమ్మకు