Facebook Twitter
రైతన్నల‌ పంచాంగం

మీ ఆయుధమైయుండగా 

దిగులిక ఎందుకు దండగ 

మీ బ్రతుకే ఉగాది పండుగ

కర్షకులారా ! 

ఓ కష్టజీవులారా ! 

అన్నదాతలారా ! 

ఓ ఆశాజీవులారా ! 

మీకిదే నా ఉగాది సందేశం 

 

చిటికెలో మాయమై 

కటికచీకటిలో కలిసిపోయి 

నమ్మిన వారిని నట్టేటముంచే 

ఫైనాన్స్ కంపెనీలలో 

చీట్టీలు కట్టకండి చితికి పోకండి 

వడ్డీలమీద వడ్డీలువేసి మీ 

నడ్డివిరిచే వడ్డీవ్యాపారుల వలలో

చిక్కుకొని గట్టు మీద పడిన 

చేపల్లా గిలగిలకొట్టుకోకండి 

 

ఏడుకొండలెక్కి 

ఆ వెంకటేశ్వరునికి మ్రొక్కి 

మేము వేడుకునేది 

కొండంత ఆశతో కోరుకునేదొక్కటే 

ఈ నవప్లవ నామసంవత్సరంలో 

ఆ వరుణదేవుడు 

మీ అందరిని కరుణించాలని 

పచ్చని పంటలు పండాలని 

మీగాదెలు ధనరాశులతో నిండాలని 

కుటుంబ సభ్యులతో 

మీరంతా కులాసాగా ఉండాలని 

 

మీ ఆదాయ వ్యయాలు 

మూడు పువ్వులు 

ఆరు కాయలుగా కాక 

మీ వ్యయం 20 గా 

మీ ఆదాయం 60 గా 

మీ చింతలు 20 గా 

మీ చిరునవ్వులు 60 గా

అంతులేని ఆత్మవిశ్వాసమే 

మీ ఆయుధమైయుండగా 

దిగులిక ఎందుకు దండగ 

మీ బ్రతుకే ఉగాది పండుగ