Facebook Twitter
విరిగిన రెక్కలు చిందిన చమటచుక్కలు

అక్కడపొలంలో

విరిగిన రెక్కలు

ఎండిన డొక్కలు

చిందిన‌ చెమట‌చుక్కలు

 

ఇక్కడ ఇంటిలో

ఆకలి కేకలు

కన్నీటిధారలు

చీకటి చావులు

అప్పులనిప్పులు

 

చివరికి రైతన్నలకు  

ఏమిటి మిగిలేది?

ఎందుకు రైతన్నల

గుండెలు రగిలేది పగిలేది?

 

నీ నా మెతుకు కోసం

ఆరుగాలాలు శ్రమించే

అహోరాత్రులు తపించే

చితికిన ఈ బడుగు రైతుల 

బ్రతుకులు చిగురించే దెప్పుడు?

 

గిట్టుబాటు ధరలేక 

గిలగిల కొట్టుకుంటూవుంటే...

అరచేతిలో స్వర్గం చూపిన 

ప్రభుత్వ పాలకులు మౌనంవహిస్తే...

రెక్కలు విరిగిన పక్షులై...

ఆకలికి అలమటించే అస్థిపంజరాలై...

ఆదుకునే నాధుడే లేక 

ఆత్మహత్యలకు పాల్పడుతూవుంటే...

 

కాస్త జాలి చూపించిన చాలునే ఈ "పాలక ప్రభువులు"

కాసింత కరుణిస్తే చాలునే దివిలోని ఆ "వరుణదేవుడు"

మన రైతన్నల జీవితాల్లో కురియవా "తేనెల వానలు"

మన రైతన్నల బ్రతుల్లో విరజిమ్మవా "వెన్నెలవెలుగులు"