Facebook Twitter
తప్పెవరిది..? విసిరిన కలానిదా..! చిరిగిన కాగితానిదా..!

తప్పులు
చేసేది మనమే...
తప్పులు
వ్రాసేది మనమే...

కానీ
పిచ్చి కోపంతో
రెచ్చి పోతాం...
జుట్టుపీక్కుంటాం...

చేతిలో కాగితాన్ని
ముక్కలు ముక్కలుగా
చించివేస్తాం...
కసిగా కలాన్ని
నేలకేసి కొడతాం...
దూరంగా విసిరేస్తాం...

ఇదేమి వింతో కదా
"తప్పు ఒకరిది...
"శిక్ష మరొకరికి....
తిట్టేది...నాలుక
పగిలేది...దౌడ
ఊడేది...పళ్ళు
మోత మోగేది వీపు...

ఔను అసలు
తప్పెవరిది...?
విసిరిన కలానిదా కాదే..!
చిరిగిన కాగితానిదా కాదే..!
నీ బుర్రది నీ బుద్ధిది..!
ఆ బుర్రలో ఆ బుద్ధిలో
జ్వాలలా చెలరేగిన
నీ గజిబిజి భావనలది..!

అవును కనిపించే
చీమైనా...దోమనైనా
కొట్టగలం...తిట్టగలం..!
కానీ "కనిపించని దాన్ని
దేనినీ మనం శాసించలేం"..!

అది
వీచే వాయువైనా..!
విద్యుత్ తరంగమైనా..!
విధియైనా ఆ విధాతయైనా..!
కడకు కనిపించని ఆ మృత్యువైనా..!!