Facebook Twitter
కవిత అంటే...?

కవిత అంటే... ?
క్లుప్తత...
స్పష్టత...
నవ్యత...ఉండాలి

కవిత అంటే...
కమ్మగా...ఉండాలి
ముగింపు
ముచ్చటగా...ఉండాలి...

కవిత అంటే...
కాస్త వేడిగా...
కాస్త వాడిగా...ఉండాలి...

కవిత అంటే...
తేనె చుక్కలా...
గంధపు చెక్కలా...
వేగు చుక్కలా...
పూల మొక్కలా...ఉండాలి...

కవిత అంటే...
కోయిల గానంలా...
గలగల పారే
గంగా ప్రవాహంలా...ఉండాలి...

కవిత అంటే...
హంస నడకలా...
నెమలి నాట్యంలా...
తిరుపతి లడ్డులా...
హైదరాబాద్
దమ్ము బిర్యానిలా...ఉండాలి...

కవిత అంటే...
ఉగాది పచ్చడిలా
రుచికరంగా...
పంచాంగ శ్రవణంలా...
శ్రవణానందకరంగా...శుభకరంగా...
మనోహరంగా...మంగళకరంగా...
విజ్ఞాన భరితంగా...చైతన్య పూరితంగా
స్పూర్తిదాయకంగా...అర్థవంతంగా .... 
ఆకర్షణీయంగా...ఆదర్శవంతంగా ఉండాలి