నా కవితలు…
నా కవితలు
రుచికరమైన చక్కని వంటలు
నా కవితలు
బడిలో గుడిలో మ్రోగే గంటలు
నా కవితలు
కడుపులు నింపే పచ్చని పంటలు
నా కవితలు చదివిన చాలు
ఆరును మీ ఆకలి మంటలు
చేరును తీరం మీ జీవితనావలు
నా కవితల్లో ఒక ఆశ వుంది
ఒక ఆలోచన వుంది ఒక ఆశయముంది
నా కవితల్లో ఆపదలు సమస్యలు వస్తే
వెంటనే ఆదుకొనే ఒక ఆయుధముంది
నా కవితల్లో ప్రాణం పోసే ఆక్సిజన్ వుంది
ప్రాణంపోతే బ్రతికించే ఒక అమృతముంది
నా కవితల్లో సమాజంలోని
అన్ని రుగ్మతలకు ఒక దివ్యఔషధముంది
నా కవితలు చదివిన చాలు
మారును తప్పక మీ మనుగడలు
కురియునుమీ బ్రతుకున తేనెలవానలు



