Facebook Twitter
చదివిన వెంటనే స్పందించేవాడు

చదివిన వెంటనే
స్పందించేవాడు
చప్పట్లు కొట్టేవాడు
చదివి కూడ మౌనంగా
మునిలా ఉండేవాడు
కాస్తకూడ చలనం లేనివాఁడు
కదలని కట్టేవాడు
ఎవరికి ఉపయోగపడని
తేనె తుట్టేవాడు
కాలిన రొట్టే వాడు నీళ్లులేని తొట్టేవాడు
ముళ్ల చెట్టే వాడు ఎండిన చెట్టే వాడు

నిన్న
నీ కోపమే నీ శత్రువు
నీ శాంతమే నీ బంధువు

నేడు
నీ నీడే నీకు శత్రువు
నీ నీడే నీకు మృత్యువు

తిండి పెట్టాలని వున్నా
పెట్టే స్తోమత లేక పోవచ్చు, కానీ
తిండిపెట్టే వారిని చూపించినా
చాలు పుణ్యముదక్కునిదినిజము

చెట్లు ఉంటేనే ఆక్సిజన్ అంట
గట్లు ఉంటేనే పచ్చని పంటలంట
మెట్లు ఎక్కితేనే దైవదర్శనమంట
ప్లాట్లు నేడు నమ్మకంతో ధైర్యంతో
కొన్నవారంతా రేపు కోటీశ్వరులౌతారంట

నిన్న కవి పోలన్న కలగన్న కనుగొన్న
నిజజీవిత సత్యమిది ఆణిముత్యమిది
ఆర్థిక రుగ్మతలకు ఔషధమిది ఆయుధమిది
మీ అందరికీ అందిస్తున్న అమృత భాండమిది
మిత్రులారా! తనివితీర త్రాగండి! త్రాగి తరించండి!