Facebook Twitter
శుభ శుభోదయం !

సహృదయులైన

సంపాదకులారా !

నా సాహితీమిత్రులారా !

మీ అందరికి సకల‌‌

శుభములు కలుగును గాక !

 

ఉషోదయ కిరణాలు

మీ హృదయాల్లోకి 

చొచ్చుకొని వచ్చును గాక ! 

అనంతమైన 

ఇంద్రియశక్తిని ఇచ్చును గాక !

 

మీ సత్సంకల్పాలన్నీ

సత్వరమే సిద్ధించును గాక !

కనిపించని ఆ దైవం 

మిమ్మును కరుణించును గాక !

 

ఆ కరుణామయుని 

కటాక్ష వీక్షణాలు

మీపై మీ కుటుంబంపై 

కుంభవర్షమై కురియును గాక ! 

 

ఆకస్మికంగా ఏ కన్నీటి వరదలు 

మీపైకి రాకుండా అడ్డుకొనును గాక !

 

ఏ‌ మొండివ్యాధులు

మిమ్మల్ని పిశాచులై

పీడించకుండా 

అండగా ఉండును గాక !

 

మీ‌ సమస్యల

సర్పాలను 

సంహరించును గాక !

కాటు వేయకుండా 

మిమ్మల్ని కంటికి 

రెప్పలా కాపాడును గాక !

 

ఆ పరమాత్మ ఆత్మ

దివినుండి 

భువికి దిగి వచ్చును గాక ! 

దివ్యమైన దీవెనలను 

వరాలను ఇచ్చును గాక !

అంతులేని ప్రశాంతతను‌‌ 

మీకు ప్రసాదించును గాక !