Facebook Twitter
ఓ ఆశా కిరణమా ! నా అభిమాన దీపమా !

మంచి మనసున్న మారాజుల
మదిలోని భావాలు మాటలైతే...?
అవి ఓంకార నాదాలే...
అవి గాయత్రి మంత్రాలే...
అనామక కవులకవి ఆశాదీపాలే...
అవి కదిలించి కనువిప్పు కలిగించి
చైతన్యాన్ని రగిలించే స్పూర్తికిరణాలే...

ఒక్క మంచుముక్కలాంటి...
గందపు చెక్కలాంటి...
వెన్నలాంటి...మల్లెపువ్వు లాంటి
మంచి మనసున్న గుబాళించే
గులాబీలాంటి గుండెలున్నవారికే...
ఉన్నతమైన ఉదాత్తమైన హృదయం
సద్బుద్ధి ఉన్న సహృదయులకే...తప్ప

కవిత్వాన్ని ఆదరించాలనే ఆలోచన ....
కవులను ప్రోత్సాహించాలనే తపన...
ఉప్పొంగదు గంగలా...అందరి గుండెల్లో...

ఓ ఆశాకిరణమా ! 
నా అభిమాన దీపమా !!

ఓ ఆశా కిరణమా !
నా అభిమాన దీపమా !
మీకు వందనం అభివందనం !
మీ ఆత్మీయ స్పందనకు అభినందనకు !

కొందరు చరిత్రను వ్రాస్తారు
కొందరు చరిత్రను చదువుతారు
కొందరు మాత్రమే చరిత్రను సృష్టిస్తారు
వారే చరితార్థులు...
వారే చిరంజీవులు...
వారే చిరస్మరణీయులు...

ఓ ఆశా కిరణమా !
నా అభిమాన దీపమా !
మంచి మనసున్న మారాజుల
మదిలోని భావాలు మాటలైతే...?
అవి ఓంకార నాదాలే...
అవి గాయత్రి మంత్రాలే...
అనామక కవులకవి ఆశాదీపాలే...
అవి కదిలించి కనువిప్పు కలిగించి
చైతన్యాన్ని రగిలించే స్పూర్తికిరణాలే...

ఒక్క మంచుముక్కలాంటి...
గందపు చెక్కలాంటి...
వెన్నలాంటి...మల్లెపువ్వు లాంటి
మంచి మనసున్న గుబాళించే
గులాబీలాంటి గుండెలున్నవారికే...
ఉన్నతమైన ఉదాత్తమైన హృదయం
సద్బుద్ధి ఉన్న సహృదయులకే...తప్ప

కవిత్వాన్ని ఆదరించాలనే ఆలోచన ....
కవులను ప్రోత్సాహించాలనే తపన...
ఉప్పొంగదు గంగలా...అందరి గుండెల్లో...
ఔను నే పదేపదే పలికే పచ్చినిజం ఇదేఇదే
కవులను ఆదరించిన వారు
కలకాలం బ్రతుకుతారు చిరంజీవులౌతారు
ప్రోత్సాహించినవారు సదా చిరస్మరణీయులే

కోటి కృతజ్ఞతలు...
శతసహస్ర ప్రణామాలు...
శతకోటి నమస్సుమాంజలులు...

పంచభూతాల సాక్షిగా...
నా అంతరంగం సాక్షిగా...
జనంసాక్షి దినపత్రిక మీద ప్రమాణం చేసి
అంతా నిజమే చెబుతాను అబద్దం చెప్పను

నా కవితలను నిత్యం ఆదరిస్తున్న ...
కవిగా నన్నెంతగానో ప్రోత్సహిస్తున్న...
నా కవితలను అందమైన ఫాంట్ తో
చక్కని కనువిందైన కలర్ బ్యాక్ గ్రౌండ్ తో
చూడముచ్చటగా...
చూడగానే చదవాలనిపించేలా...
చదివి భద్రంగా దాచుకోవాలనిపించేలా...
అందంగా...ఆకర్షణీయంగా...
అద్భుతంగా ప్రచురించిస్తున్న...
నా కవితలను వెలుగులోనికి తెస్తున్న...
పాఠకదేవుళ్ళకు అందిస్తున్న...
నేను కలనైనా ఊహించని రీతిలో
కవిగా నాకు ఒక
"గొప్పగుర్తింపును" తెచ్చిన...
అనేక దినపత్రికల్లో
మొట్టమొదటి దినపత్రిక
"జనంసాక్షి" దినపత్రిక

గౌరవనీయులైన...
సహృదయులైన...
సాహితీ పిపాసి కళాపోషక
పత్రికాసంపాదక శిఖామణి
శ్రీ శ్రీ శ్రీ యం యం రెహమాన్ గారికి
వారి సిబ్బందికి ప్రత్యేకించి
కవితల డెస్క్ ఇంచార్జి గారికి
వారి నిస్వార్థ సేవలకు అంకితభావానికి...
శిరసు వంచి...రెండుచేతులు జోడించి...
కోటి కృతజ్ఞతలు...
శతసహస్ర ప్రణామాలు...
శతకోటి నమస్సుమాంజలులు...
అభినందన మందార మాలలు అర్పిస్తున్న...

జనంసాక్షి దినపత్రిక
పచ్చని చెట్టులా ఎదిగిఎదిగి
ఒక వటవృక్షంలా విస్తరించాలని...
పత్రికారంగంలో
కవులందరి ఆశిస్సులతో
ఒక ధృవతారగా వెలగాలని...
కలకాలం రారాజుగా నిలవాలని....
పాఠకులకు హృదయాలను గెలవాలని...

సంపాదకులకు‌
వారి సిబ్బందికి ఆ అల్లా
కరుణా కటాక్షవీక్షణాలు
నిండుగా మెండుగా ఉండాలని...
వారిపై వారి కుటుంబాలపై
కుంభవర్షమై కురవాలని...

వారందరూ ఇప్పుడూ ఎల్లప్పుడూ
చిరునవ్వులతో... సిరిసంపదలతో...
సంతోషాలతో...సంబరాలతో
పిల్లాపాపలతో... చల్లగా ఉండాలని...
ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో...
హాయిగా...ఆనందంగా...ప్రశాంతంగా
నిండునూరేళ్ళు వర్ధిల్లాలని...
మనసారా కోరుకుంటూ...

పేరుపేరున ప్రతిఒక్కరికి హృదయపూర్వకంగా
అక్షరపుష్పాలను అర్పిస్తున్న...సమర్పిస్తున్న...