Facebook Twitter
కవిత్వం రాయటం ఎలా...!?

కావ్యమనగా రసవంత మయిన వాక్యం....                     

రసమనకు ప్రధానమైనది శబ్ధం కాదు..శబ్దార్ధం
మాట అనీఅనటం తోటే రసం స్ఫురించితే గానీ ఆనందం కలగదు...

 భాష భావమునకు వాహకం...                                

వకరి హృదయమునందున్న భావం వేరొక హృదయమునకు చేరాలి...
కళాభిజ్ఞుల పనితనం -అద్దా నికి వెనుకతట్టు కళాయి పూసినట్లు-

 కంటికి కనపడకుండా ఉంటేనే ప్రసంసార్హమౌతుంది.
ద్రష్ట అయినవాడే సాహిత్య స్రష్ట కాగలడు ...

 ద్రష్ట - చూసే వాడు ,మనస్సు చేత కనుగొనే వాడు

,గునదోషాలను తెలుసుకోనే వాడు....

న్యాయాన్యాయలను పరిశీలించే నిర్ణయకర్త....
ప్రతి ఉత్తమ కవిత్వంలోనూ పురాణ గాధ-

 మంత్ర చర్య- కళా కలగలిసి ఉంటాయి...

పోరాటం నుండే కవిత్వం పుడుతుంది....                           

కవికి ప్రాధమికంగా వుండాల్సినవి.                

ప్రతిభ -వ్యుత్పత్తి- అబ్యాసం వాటిలో ప్రతిభ ఉత్తమమైనది...
మంచి రచన చదివాక బొంచేసినట్లుండాలి..

.కొంచెం భాద పడాలి చించుకున్నట్లు ఉండాలి

మనస్సుకు జ్వరం రావాలి- ఒళ్ళు తిరగాలి

 ఆ బాధ నుండి తేరుకొని బాగుపడాల