పేరుతో కవిత
కె - రటం నాకు ఆదర్శం పడినందుకు
కాదు పడినా తిరిగి పైకి లేచినందుకు
పో - రాడు, పోరాడితే పోయేదేం లేదు
నీ బానిస బ్రతుకు బాగుపడడం తప్ప
ల - క్ష్యంలేని జీవితానికి విలువ లేదు
అలలు లేని సముద్రానికి అందం లేదు,వె
య్య - కు నిచ్చన ఆకాశానికి, ముయ్యకు
తలుపులను అవకాశాలకు అదృష్టానికి
క -ంటి నిండా నిద్రపో కమ్మని కలలుకను
ఆ కలలు నిజమయ్యే వరకు నిద్రపోకు
వి - జయం వస్తుంది ముందే నిలుస్తుంది
వీరుల్ని విజేతల్ని విందుకు పిలుస్తుంది.



