Facebook Twitter
రవికిరణం..... కవికలం

మొన్న రవి గాంచనిచో
కవిగాంచు నన్నారు
వెలుగులు విరజిమ్మే రవికన్న
సాహితీ వెలుగులు విరజిమ్మే
కవిమిన్న అన్నారు

నిన్న కత్తి కన్నా కలం మిన్న అన్నారు
రాజ్యాలను ఏలే రాజుల కన్నా 
కవిశేఖరుడే మిన్న అన్నారు

కానీ నేడు నేనంటున్నాను
కవికి జనమే కానీ మరణం లేదని
కారణం ఒక్కటే
కవి వ్రాసిన అక్షరాలు శాశ్వతం
కవి రాసిన కావ్యాలు శాశ్వతం
వాటికి జీవమే కానీ మరణం లేదాయె
మరి వాటిని కన్న ఆ కవికెక్కడిది మరణం?
అందుకే కవి కీర్తి ఆచంద్రతారార్కం

అకస్మాత్తుగా ఎక్కడికో
వెళ్ళారని అనుకుంటున్నాం
కాని వారు ఇక్కడే
ఇక్కడే మన ప్రక్కనే ఉంటారు
మన మధ్యనే వుంటారు
మన తలపుల్లో మన భావాల్లో
బ్రతికే వున్నారు వుంటారు
అనేక సాహితీ సాంస్కృతిక
సంస్థలలో క్రియాశీలక వ్యక్తిగా
ఎన్నో ప్రశంసలందుకున్నారు
ఎన్నో సన్మానాలు
సత్కారాలు పొందారు,

ఆత్మీయతకు ప్రేమకు
ప్రతిరూపమైన
స్నేహానికి సహృదయతకు
మంచితనానికి మానవత్వానికి
కలుపుగోలుతనానికి
నిలువెత్తు నిదర్శనమైన