Facebook Twitter
అన్నదాతకందరూ శతృవులే ! 

ఆకాశానికి 

చిల్లిపడిందా? కాదు...కాదు

రైతుకళ్ళకు చిల్లిపడి 

కన్నీటి కుంభవర్షం కురిసింది

 

చెరువులకు‌ 

గండి పడిందా? కాదు...కాదు

లయతప్పిన,వ్యధనిండిన 

రైతులగుండెలకు గండి పడింది

 

కాపుకొచ్చిన పంట 

కొట్టుకుపోయిందా ? కాదు...కాదు 

నిన్న రైతులు కన్న కమ్మనికలలు 

రేపటి కోటిఆశలు...కొట్టుకుపోయాయి

 

రోడ్లు రహదారులు 

తెగిపోయాయా ? కాదు... కాదు 

మొన్న ఆకలి ఆకలంటూ కేకలుపెట్టిన

నిన్న రాక్షస రాజకీయాలను‌ ప్రశ్నించిన

రైతన్నల గొంతుకలు.... తెగిపోయాయి

 

మొన్న కరువు కరాళ నృత్యం...

నిన్న కరోనా విలయతాండవం...

నేడు అతివృష్టి...ప్రకృతి ప్రళయం...

అన్నీ అన్నదాతలకు బద్దశత్రువులే...

 

అధికారులారా ! తక్షణమే అన్నదాతలనాదుకోండి!

అన్నదాతల ఆత్మాహత్యలకు ముగింపు పలకండి!