అన్న పోలన్న సుభాషితం..! విన్న మీజీవితం సువర్ణశోభితం..!!
గొంతు పెంచకు
గొడవ పడకు..!
చింతించకు
చితిని పేర్చుకోకు..!
తాటాకు చప్పుళ్ళు
కుందేళ్ళు బెదరవు..!
ఎండమావుల వెంట
పరుగులు తీసిన వారికి
దాహం తీరదు..ఎన్నటికీ..!
నీవెంతగా దుఃఖించినా...
శ్రమపడక కలలు పండవు..!
నీవెన్ని పగటికలలు కన్నా...
కడలిలో అలలు ఆగవు..!
కడుపు నిండును
కండ బలంతోనే..!
ఘన విజయం చేకూరును
శ్రమశక్తితోనే గుండె బలంతోనే..!
అరచేతిని అడ్డుపెట్టి
సూర్యకాంతిని ఆపకు..!
మాయ మర్మం వద్దు...
మంచితనం మానవత్వమే ముద్దు..!
ఆచరణలేక ఆలోచనలతో ఆకలి తీరదు భగవంతుని కృపలేక నీ బ్రతుకు మారదు



