Facebook Twitter
అన్న పోలన్న సుభాషితం..! విన్న మీజీవితం సువర్ణశోభితం..!!

పెంట మీద పైసానైనా
...కంట పడితే కాజేసేటి...
పరుల బాధలు అసలే
...ఎరుగని పరమ
పిసినారులే...కన్నుమూస్తే...
...పిలిచినా రావేమో కాకులు
రేపు వారి పిండాలు తినడానికి...

అన్న పోలన్న పలికిన ఈ సుభాషితం..!
విన్న‌...మీ జీవితం....సువర్ణశోభితం..!!

కాళ్లు అరిగేలా
తిరిగి తిరిగి కళ్ళు చెదిరేలా
ఇంద్రభవనం వోలె ఇల్లు కట్టి
అనుభవించక అద్దెకు ఇంటిని‌చ్చేవాడు
ఆవివేకేరా...పరమ ఆశబోతేరా...

అన్న పోలన్న పలికిన ఈ సుభాషితం..!
విన్న‌...మీ జీవితం....సువర్ణశోభితం..!!

మెప్పు కోసం అప్పు చేసి
ముప్పు తెచ్చుకోకురా...
ఒక్కచేత ఆర్జించి
రెండుచేతుల ఆరగించకురా...
ఆర్జించింది అనుభవించరా...
ఆపై పదిమందికి పంచి అస్తమించరా...

అన్న పోలన్న పలికిన ఈ సుభాషితం..!
విన్న‌...మీ జీవితం....సువర్ణశోభితం..!!

ఉక్కిరిబిక్కిరి చేసే
అక్కరొచ్చి ఊరంతా అప్పుల్జేసి  తీర్థయాత్రలకు వెళ్ళినా
తీరునా  ఆ ఋణశాపం... 
చుట్టుకుంటుందిరా ఈ పాపం...
రేపు పుట్టే నీ పిల్లలకు సైతం.....

అన్న పోలన్న పలికిన ఈ సుభాషితం..!
విన్న‌...మీ జీవితం....సువర్ణశోభితం..!!