Facebook Twitter
అన్నపోలన్న సూక్తిసుధ..!

అంతులేని
సుఖశాంతులకిదే
ఆనందనిలయం..!
విధిని ఎదిరించలేని
వారికిదో విషాధవలయం..!
నవ్వుతూ జీవించే వారికి
ఈ జగమే ఓ నందనవనం..!
అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీ జీవితం సువర్ణశోభితం..!

దొరలకైనా దొరకనిది..!
వజ్రాల కన్నా విలువైనది..!
కోట్లు పోసి కూడా కొనలేనిది..!
మనశ్శాంతిరా...! ఆ మనశ్శాంతికి
వెలకట్టగలవాడు ఈ మహిలోలేడురా..!
అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీ జీవితం సువర్ణశోభితం..!!

వేదవిద్యలెన్ని నేర్చుకున్నా..!
శాస్త్రీయ గ్రంధాలెన్ని చదివినా..!
యోగాసనాలు వేయకున్న..!
వ్యాయామం చేయకున్న...!
బొజ్జగణపయ్య నీకు అన్నేరా..!
ఆరోగ్యం నీకు సున్నేరా...!
అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీ జీవితం సువర్ణశోభితం..!!

కొంచమైన వ్యాయామం
లేకున్న క్రొవ్వు పెరుగురా..!
నరనరాల్లో ఒత్తిడివల్ల
ముఖాన నవ్వు తరుగురా ..!
గుట్టుచప్పుడు కాకుండా
వచ్చేది గుండె జబ్బేరా..!
అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీ జీవితం సువర్ణశోభితం..!!