Facebook Twitter
సుభాషితాలు - సూర్య కిరణాలు..!

బుసలుకొట్టే భుజంగం...

...పైకి లేచి పడగ విప్పేనురా !
...నాగస్వరం విని నాట్యమాడేనురా !
...పాదాలు లేక పరిగెత్తేనురా !
...పాలుత్రాగి పచ్చివిషం గ్రక్కేనురా !
...ఈ విశ్వంలో వింత జంతువు
...బుసలుకొట్టే భుజంగమేనురా !
...అన్న పోలన్న సుభాషితం !
...విన్న మీకు శుభోదయం !!

పరమాత్ముడే పగబడితే...?

...సముద్రాలు ఇంకిపోయి...
...చుక్కలే రాలిపోయి
...సూర్య చంద్రులే గతితప్పిన
...సృష్టేలేదురా అంతా శూన్యమేనురా !
...పరమాత్ముడే పగబడితే
...నరుడి బ్రతుకు నరకమేనురా !
...అన్న పోలన్న సుభాషితం !
...విన్న మీకు శుభోదయం !!