Facebook Twitter
అన్న పోలన్న సూక్తి సుధ..!

వేదవిద్యలెన్ని నేర్చినా..!
శాస్త్రీయ గ్రంధాలెన్ని పఠించినా..!

వ్యాయామం చేయకున్న...!
యోగాసనాలు వేయకున్న..!

బొజ్జగణపయ్య నీకు అన్నేరా..!
సంపూర్ణ ఆరోగ్యం నీకు సున్నేరా...!

అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీ జీవితం సువర్ణశోభితం..!!

కొంచమైన వ్యాయామం
లేకున్న క్రొవ్వు పెరిగేనురా..!

నరనరాల్లో ఒత్తిడివల్ల
ముఖాన నవ్వు తరిగేనురా ..!

గుట్టుచప్పుడు కాకుండా
వచ్చేది గుండె జబ్బేనురా..!

అన్న పోలన్న సుభాషితం..!
విన్న మీ జీవితం సువర్ణశోభితం..!!