నిజజీవిత నిత్యసత్యాలు..! అనుభవాల ఆణిముత్యాలు..!!
నిరంతరం వెలిగే
సూర్యుడ్ని చూసి
చీకటి.....భయపడుతుంది.
నిరంతరం శ్రమించే
మనిషిని చూసి
ఓటమి...భయపడుతుంది.
పని చెయ్యాలనుకునే
వారికి దారి...దొరుకుతుంది.
చెయ్యొద్దనుకునే
వారికి సాకు...దొరుకుతుంది.
విజయానికి...పొంగిపోకు...
అపజయానికి...కృంగిపోకు...
నేటి ఈ...ఓటమే రేపటి
నీ ఘనవిజయానికి...సోపానం
ఒకరి గురించి ఒకరు
కుళ్ళుకోవడం...మానేసి
ఒకరితో ఒకరు ప్రేమగా
మాట్లాడుకోవడం...మొదలెడితే
పలుసమస్యలు పరిష్కారమౌతాయి.
కాలు జారితే...కలిగే గాయం
కొంత కాలానికి మానవచ్చు
కానీ నోరు జారితే...కలిగే గాయం
ఎప్పుడు మానుతుందో ఎవరికెరుక.
ఇవే ఇవే...నేనెరిగిన
నిజజీవిత నిత్యసత్యాలు...
నా అనుభవాల ఆణిముత్యాలు...



