Facebook Twitter
రుద్రులైన రైతన్నలకు మద్దతిద్దాం...

ఓ రైతన్నలారా!

మీకేం భయంలేదని మీ వెనుకే 

మేమున్నామన్న భరోసానిద్దాం !

తిన్నఇంటి వాసాలు లెక్కపెట్టే

ఆకలేస్తే అన్నంపెట్టే అన్నదాతను

పెన్నుతో వెన్నుపోటు పొడిచే 

ఈనల్లచట్టాలను "చెత్తకుండీలో" విసిరేవరకు

విశ్రమించక...పిడికిళ్లు బిగించి...

ప్రభుత్వ వైఖరిని...ప్రశ్నిస్తున్న...ప్రతిఘటిస్తున్న

ఉగ్రులై...ఉద్యమిస్తున్న...రైతన్నలకు మద్దతిద్దాం !

మేకవన్యపులుల ముసుగు వేసుకున్న 

ఆ ముడుచట్టాలను 

"బంగాళాఖాతంలో" కలిపేవరకు

చాటుమాటుగా కాటు వేస్తే

ఈ విషసర్పాల విషపు కోరలు విరిచేవరకు

విశ్రమించక...పిడికిళ్లు బిగించి...

ప్రభుత్వ వైఖరిని...ప్రశ్నిస్తున్న...ప్రతిఘటిస్తున్న

ఉగ్రులై...ఉద్యమిస్తున్న...రైతన్నలకు మద్దతిద్దాం !

ఎన్నిసార్లు పడినా పైకి లేచే 

రైతేరాజని న్యాయం రైతు వైపేనని

ఏ రోజైనా‌ రైతుదే విజయమని

ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా

చెడుకే ఓటమని మంచికే గెలుపని 

చీకటీకే ఓటమని వెలుగుకే విజయమని

చివరికి ఘనవిజయం

రాజధానిరోడ్లను ట్రాక్టర్లతో దున్నుతున్న

"చలిచీమలదండై" కదిలి

కదంతొక్కుతున్న ఈ రైతన్నలదేనని

ఈ "నిరసన వాయుగుండం"

తీరందాటితే ఇక "పెనుతుఫానేనని" 

గద్దెలనెక్కిన పెద్దలు "గుర్తించేవరకు"

విశ్రమించక... పిడికిళ్లు బిగించి...

ప్రభుత్వ వైఖరిని...ప్రశ్నిస్తున్న...ప్రతిఘటిస్తున్న

ఉగ్రులై...ఉద్యమిస్తున్న...రైతన్నలకు మద్దతిద్దాం !