ఓ సౌందర్యమా నీవెక్కడ?
ఆహా ఏమీ
ఆ జవరాలి
అందము ! అది
మతిపోగొట్టే
మన్మధబాణమే
ఆహా ఏమి
ఆ వగలాడి
ఒంపు సొంపులు !
ఆమె సొంతమైతే ఇక
నా బ్రతుకు స్వర్గమే
ఔరా! ఇదినిజమే
ఆ సౌందర్యరాశి
నా కంటపడితే
నా మనసు తన
వెంట పడితే నాకు
ఇక ఆకలుండదు
దాహముండదు
తనను చూస్తుంటే
ఔను బాహ్యసౌందర్యం కన్న
అంతఃసౌందర్యమే మిన్న అంటారే
మరి ఓ సౌందర్యమా నీవెక్కడ?
నవయవ్వనజవ్వని
ఓరచూపుల్లోనా
కోరచూపుల్లోనా
కొంటెచూపుల్లోనా
చిలపిచూపుల్లోనా
చిలకపలుకుల్లోనా
కులుకు నడకల్లోనా
నాజూకైన నడుములోనా
ఎగిరే ముంగురుల్లోనా
నల్లత్రాచులా నాట్యమాడే
వాలుజడలోనా
మెరిసే మెడలోనా
చేతి గాజుల్లోనా
మత్తెక్కించే
కాటుక కళ్ళల్లోనా
కాలిఅందెల్లోనా
కట్టినచీరలోనా
పెట్టినబొట్టులోనా? లేదు లేదు!
ఓ సౌందర్యమా ! మరి నీవెక్కడ?
ఆపదలో ఆదుకునే
అమృతహస్తాల్లో నేనక్కడ !
కరుణ ప్రేమ దయ
జాలి మంచితనం
మానవత్వం నిండి
పొయ్యిమీద పాలలా పొంగిపొర్లే
ప్రతిమనిషి అంతరంగంలో నేనక్కడ !



