అనగనగా ఒక జంట
సమాజానికి సవాలు "విసిరేనంట"
అందరూ అసహ్యించుకున్న
అందరరినీ మోసంచేసిన అందరి
ఆగ్రహానికి గురైన ఆ అక్రమజంట
బ్రతికివున్నా చచ్చిన "శవాలేనంట"
మొన్న ఆ జంట ప్రకృతిఒడిలో
ప్రేమపాఠాలు "నేర్చుకుంది"
నిన్న కళ్ళుపొరలు కమ్మి కామంతో
కొండల్లో గుట్టల్లో కోర్కెలు "తీర్చుకుంది"
నేడు పాడుపడ్డ ఓ గుడిలో
పూలదండలు "మార్చుకుంది"
సిగ్గులజ్జ వావివరసలేని ఆ జంట
సభ్యసమాజం దృష్టిలో
నక్కినక్కి తిరిగిన "నక్కలంట"
కక్కినదానికి ఆశపడిన "కుక్కలంట"
నీతితప్పి గోతిలోపడ్డ "కోతులంట"
పరమ "తిరుగుబోతులంట"
అందుకే ఈసమాజం వారికి శిక్షవేసింది
కులముగోత్రము ఆస్తిఅంతస్తు మరచి
కన్నవారి కళ్ళళ్ళో కారం చల్లి
గుండెల్లో గునపాలుగుచ్చిన ఆజంట
పరువుప్రతిష్టల్ని
పచ్చగడ్డిలా మేసిన "పశువులంట"
అందుకే ఆజంటంటే తల్లిదండ్రులకి
అంత మంట అంత కసి అంత కక్ష
అందరినీ చివరికి ఆ భగవంతున్ని
మోసంచేసిన ఆ జంట "అనాధలంట"
ఎవ్వరూ వెంటరాని "ఒంటరివాళ్ళంట"
అందరికీ వారు "అంటరానివాళ్ళంట"
బంధువులంతా "బద్దశతృవులంట"
అందుకే వారి ప్రేమకు ఒక అగ్నిపరీక్ష
ఆపరీక్షలో ఓడిన ఆ జంట చేసిన "ప్రేమపోరాటం"
ప్రేమపక్షులకు నేర్పింది గుర్తుండే "ఒక గుణపాఠం"
ప్రేమే "ఒక త్యాగమైతే" కురిపిస్తారు "పూలజల్లు"
ప్రేమే "ఒక రోగమైతే" విసురుతారు "ముళ్ళురాళ్ళు



