ఊరికిఊరికే వులిక్కిపడరాదు
ఉక్కిరిబిక్కిరైపోరాదు
ఉక్రోషము ఉద్రేకం ఉండరాదు
పిచ్చికోపంతో రెచ్చిపోరాదు
అనవసరమైన అర్ధంలేని పిచ్చిపిచ్చి
ఆలోచనలు చేయరాదు
పగ ప్రతీకారాలు వద్దు
అవి ప్రమాదాలు కొని తెస్తాయి
అసూయా ద్వేషంతో రగిలిపోరాదు
నరాలు తెగేలా బిగ్గరగా అరవరాదు
చిన్నవాటికే ఆవేశపడరాదు
చీటిమాటికి ఆందోళన చెందరాదు
అందనిదానిని నీకు చెందనిదానిని ఆశించరాదు
ఎవరితోను విరోధము పెంచుకోరాదు
ముఖంలో చిరునవ్వు ముఖ్యం
చిరచిత్తం స్థితప్రజ్ఞత చాలా ముఖ్యం
హృదయం శాంతము దయ జాలి
కరుణ ప్రేమతో పొంగిపొర్లాలి
దుఖమునకు దూరంగా వుండాలి
కన్నీటిని కార్చరాదు కలత చెందరు
ఆరోగ్యమే మహాభాగ్యమనే ఆశ ద్యాస కలిగివుండాలి
నిత్యం నడక నిత్యం భగవన్నామ స్మరణ
కాసింత పడకా
కాసింత విశ్రాంతితో కాలం గడపాలి
నాలుగురితో ఉండాలి నవ్వుతూ ఉండాలి
ప్రశాంతంగా జీవించాలి
పరమాత్మలో లీనమైపోవాలి



