Facebook Twitter
సాధించాలంటే సంపాదించాలంటే

అనేక అనుమానాలతో
అపోహలతో అర్థంలేని సందేహాలతో
దగ్ధమైపోయే దద్దమ్మలు

ఎన్ని మంచి సందేశాలు పంపినా
చదివి స్పందించని
ఎన్ని చక్కని సలహాలు ఇచ్చినా
స్వీకరించని సన్యాసులు

జీవితంలో ఏమీ సాధించలేరు
ఏమీ సంపాదించలేరు
పేదవాళ్ళుగానే వెళ్ళిపోతారు

కుటుంబ యజమానిగా
కొంత కూడబెట్టాలంటే
ఆస్తులు అంతస్తులు ఆర్జించాలంటే
ఆర్జించింది కాసింతైనా అనుభవించాలంటే

ఎవరినో ఒకరినైనా నమ్మాలి
ముందు దమ్ము ధైర్యం వుండాలి
తెలివితో తెగింపుతో పెట్టుబడి పెట్టాలి

కోట్లు ఆర్జించి కోటీశ్వరులు కాకపోయినా
దాచుకొని డబ్బు ధనవంతులు కాకపోయినా
దాతలుగా మిగిలినా చాలు బ్రతుకు ధన్యమే