ఆశాజీవి అన్నదాత....
ఆరుగాలాలు శ్రమించి దుక్కిదున్ని
స్వేదాన్ని చిందించిన కర్షకులు కోరేది
కాసిన్ని పచ్చడి మెతుకులే
పంచభక్ష పరమాన్నాలు కాదుగా
అన్నదాతలు ఆశించేది
తాము చేసిన శ్రమకు
పడిన కష్టానికి ఫలితం దక్కితేచాలని
పటిష్టమైన చట్టాలను రూపొందించమనే
చిన్న సన్నకారు రైతులు కోరేది
కోట్లకోట్ల రుణాలు కాదు
చిన్న చిన్న ఋణాలమాఫీ చెయ్యమనే
మేలురకమైన కల్తీ విత్తనాలు
సరసమైన ధరలకు ఎరువులు
పురుగు మందులు సరఫరాచేయమనే
దళారీలు దగాకోలని
మార్కెట్ యార్డుల్లో అంతా
మాయాజాలమేనని
ప్రకృతి పగబట్టిందని
గిట్టుబాటు ధర లేక
కొట్టుమిట్టాడుతున్నారు
అప్పుల అగ్నిగుండంలో పడి
మలమలమాడిపోకుండా
అన్నదాతనుఆదుకోండి
గిట్టుబాటు ధర అందించండి



