Facebook Twitter
వద్దురా వద్దురా ఘర్షణలు వద్దురా

అడగవద్దు అలగవద్దు
ఆశించవద్దు దూషించవద్దు
శోధించవద్దు సోకించవద్దు
సాధింపులువద్దు వేధింపులువద్దు

అదిరింపులు వద్దు బెదిరింపులు వద్దు
అర్ధంలేని ఆంక్షలు అసలేవద్దు
నేడేమీది రేవు మీదికాదు
వారిది ఎదిగే మొక్కల జీవితం
మీది అరటి తొక్కల జీవితం

అరుపులువద్దు విరుపులువద్దు
ఉరుములు మెరుపులువద్దు
వారి ముందు బ్రతుకంతా నిండు పౌర్ణమి
మీ ముందు బ్రతుకంతా చిమ్మచీకటి

గర్జనలువద్దు ఘర్షణలువద్దు
గాండ్రింపులువద్దు గద్దింపులువద్దు
వారికి ఇంటినిండా డబ్బులు
మీకు ఒంటినిండా జబ్బులు

వారికెరుకే మీరు
కోరలులేని పులులని
మూలిగే ముసలి నక్కలని
కరవలేని గజ్జికుక్కలని

మరి ఓటమి ఖాయమని తెలిసీ
యుద్దానికెెందుకు సిద్ధమౌతారు ?
దేనికి క్రుంగిపోవద్దు పొంగిపోవద్దు
స్థిరచిత్తం మౌనవ్రతం రాజీమార్గమే

 ఉత్తమం......ఉత్తమం......ఉత్తమం