ఆప్రయాణం శుభప్రదం
కలిసి కబుర్లాడుకుంటూ
బజారులోనో పార్కులోనో
తండ్రీకొడుకులు
నవ్వుతూ త్రుళ్ళుతూ నడవడం
కాదు ముఖ్యం
తండ్రిచెేతిని
కొడుకు పట్టుకున్నాడా
కొడుకుచేతిని
తండ్రి పట్టుకున్నాడా
అన్నదే ఇక్కడ ముఖ్యం
కారణం
తండ్రిచెేతిని కొడుకుపట్టుకొనివుంటే
ముందు పెనుప్రమాదం
దొంగలా పొంచివున్నట్లే
పిల్లాడు చేజారి
ఏక్షణాన్నైనా క్రింద పడిపోవచ్చు
కానిఅదే
కొడుకుచేతినే తండ్రిపట్టుకొనివుంటే
ఇక కొడుకు చేజారే ప్రసక్తేలేదు
ఆప్రయాణం
శుభప్రదం సుఖమయం
ఇద్దరు సురక్షితంగా
నవ్వుతూ ఇల్లు చేరుకుంటారు



