ఒకే పనిని
పదేపదే చెయ్యడం వలన
పదేపదే చూడడం వలన
పదేపదే వినడం వలన
పదేపదే వ్రాయడం వలన
పదేపదే నిద్రలోకూడా నిరంతరం కలవరించడం వలన
నిద్రాహారాలు మాని మనసులో జపించడం వలన
ఆ పని నీ వశమైపోతుంది
ఆ పనిని ఇంత శ్రద్దగా చేసిన నీకు
ఆ పనితో విడదీయలేని
ఒక గొప్పబంధం అనుబంధం
ఏర్పడుతుంది
ఆపై ఆ పనిని నీవు త్వరగా చేయగలవు
చాలా సమర్ధవంతంగా సత్ఫలితాల నిచ్చేలా చెయ్యగలవు
ఆ పని చెయ్యడం ద్వారా నీకు
అనేక లోతైన విషయాలు
మెళుకువలు చిన్నచిన్న చిట్కాలు బోధపడతాయి
ఆ పనిని ఎలాచెయ్యాలో నీ కళ్లకు అద్దంలో కనపడినట్లు ఒక దృశ్యం లాగ స్పష్టంగా కనపడుతుంది
అదే సాధన అదే కృషి అదే పట్టుదల
అంటే ఒకేపనిని అదేపనిగా
పదేపదే చేయడం వల్ల
మనసుని దానిమీదనే పూర్తిగా
లగ్నం చెేయడం వల్ల
ఏకాగ్రతతో చెేయడం వల్ల
ఊహించని అత్యద్భుతమైన
సత్ఫలితాలు నీకు అందుతాయి
ఘనవిజయాలు నీ సొంతమౌతాయి
ప్రజలనుండి ముందు ప్రశంసలు
ఆ తర్వాత సభలు సన్మానాలు జరుగుతాయి
ఈ జన్మకు సరిపడా ఆనందం అనంతమైన తృప్తి నీకుదొరుకుతాయి
అందరు నిన్ను ప్రేమిస్తారు గౌరవిస్తారు
నీ జీవితం అందరికి ఆదర్శంగా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది
చరిత్రలో చిరకాలం చిరంజీవిగా
నీవు మిగిలిపోతావు.



