Facebook Twitter
హంస" లా హాయిగా జీవించు

ఓ నా ప్రియ నేస్తమా!
నీవు లేచింది మొదలు
నిద్ర పోయేంత వరకు
భారతీయతనే జపించు
విశ్వశాంతికై తపించు
   - స్వామి వివేకానందలా

నీ లోని పగను ప్రతీకారాన్ని
ద్వేషాన్ని కోపాన్ని తక్షణమే త్యజించు
   - గౌతమ బుధ్ధునిలా

అందరికి ప్రేమను పంచు
మంచిని మానవత్వాన్ని ప్రబోధించు
  - ప్రభువైన యేసు క్రీస్తులా

అట్టడుగు వర్గాల హక్కులకై
నిప్పులా జ్వలించు నిరంతరం పోరాడు
  - డాక్టర్ బి ఆర్ అంబేత్కర్ లా

అహింసే ఆయుధంగా రక్తపాత రహితంగా అనుకున్నవన్నీ సాధించు
   - మహాత్మాగాంధీలా

హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా అందరికీ ఆదర్శంగా ప్రశాంతంగా జీవించు
   - శ్రీ రామకృష్ణ పరమ 'హంస'లా

ఇలాచేస్తే నీ జన్మ ధన్యం
నీ జీవితం సార్థకం
ఇందులో లేనేలేదు సందేహం
ఇదే నీ శ్రేయోభిలాషిగా నీకు నేను అందించే "అద్భుత అక్షర సందేశం"