Facebook Twitter
ఎవరు నీవు? మనిషివా? మూగమృగానివా? ®

ఇస్తానని ఆశచూపి ఇవ్వక పోవడం
చేస్తానని సహాయం చెయ్యక పోవడం
అన్నమాట మీద నిలబడక పోవడం

వాయిదాలు వెయ్యడం
నమ్మినవారిని నట్టేట ముంచడం
నటించడం అంటే నాకు నచ్చదు

అట్టి వారిని విమర్శించడానికి
గట్టిగా హెచ్చరించడానికి
ఎంత చెప్పినా వినకపోతే
ఏకిపారెయ్యడానికి
కోరల్ని పీకెయ్యడానికి
కొమ్ముల్ని విరిచెయ్యడానికి
బుద్ధికి బూజుపడితే దులపడానికి
అది వంకరగా వుంటే సరిదిద్దడానికి
సదా నేను సిద్దం

మనిషిలోని మంచికోసం
మానవత్వంకోసం
మహత్తరమైన మార్పుకోసం 
సంఘంలో సమానత్వం కోసం

నాకలమెప్పుడూ చేస్తూనే
ఉంటుంది ధర్మయుద్ధం

మనిషికి మృగానికి
మధ్య ఆరు తెరలు ఉంటాయి
వినయం - విధేయత
విజ్ఞానం -  వికాసం
విచక్షణ -   విలువ

ఇవి లేనినాడు మనిషి మృతప్రాయుడే
అవిఉన్నవాడు అందరికి ఆదర్శవంతుడే