Facebook Twitter
బలిపీఠంపైన బడుగురైతు

నిన్న 

కోవిడ్ కొట్టిన 

కొరడా దెబ్బల 

గాయాలలింకా 

మానిపోకముందే 

వ్యవసాయ 

వ్యతిరేకత చట్టాలతో

పాలకులు

కార్పోరేటర్ల కొమ్ముకాస్తు

రైతన్నల నోట్లో 

మట్టి కొడుతుంటే

బ్రతుకు బలైపోయే

బడుగురైతు బలిపీఠమెక్కె

అందరి ఆకలినితీర్చే

అన్నదాతకే అగ్నిపరీక్షలాయే

 

నేడు

రైతుసంఘాలతో 

సంప్రదింపులు లేవాయే 

అడ్డదారుల్లో 

బిల్లులు ఆమోదమాయే

ఒప్పంద వ్వవసాయ

వివాదాల పరిష్కారానికి

విధివిధానాలే లేవాయే 

మద్దతుధర 

మాటే మరిచిపోయే 

అన్నదాత భవిత

అందకారమాయే

మెతుకు కరువైపోయే 

బ్రతుకు బుగ్గిపాలాయే

బురదనుండి బువ్వ తీసే

బడుగురైతు బలిపీఠమెక్కె

ఓరా ఆకలితీర్చేఅన్నదాతలపట్ల

ఏమి ఈ కర్కశం ఏమి ఈ నిర్దయ

ఏమి ఈ నిర్లక్ష్యం, ఏమి ఈనిరంకుశత్వం

శాంతియుత ఉద్యమాలే రేపు ఉగ్రరూపం దాల్చి

ఉప్పెనలైతే.....సూనామీలైతే......బాధ్యులెవరు?

పాషాణ హృదయులైన పాలకులు కాదా?