Facebook Twitter
ఆత్మవిశ్వాసమే...ఆక్సిజన్...

ఓ రైతన్నా ! చేయకు చేయకు తలకు 

మించి అప్పులే అవి ఎప్పుడూ ఆరని నిప్పులే...

 

నీలాంటి బక్కరైతులెందరో ఇంకా బ్రతికే వుండగా 

నీవే ఎందుకు ఆవేశంతో ఆత్మహత్య చేసుకోవాలి?...

 

నీవే ఎందుకు బ్యాంకు అప్పులకు 

భయపడి సన్యాసం పుచ్చుకోవాలి?...

 

నీ భార్యా పిల్లలే ఎందుకు అనాధలై పోవాలి ?

వారే‌ ఎందుకు ఆకలికి అలమటించాలి?...

 

విజ్ఞతతో ఆలోచించరా రైతన్నా !

ఆశే మనిషికి ఊపిరన్న

ఓ పచ్చినిజం తెలుసుకోరా రైతన్న!...

 

కరువు...కరువు...పరువు... 

పరువని కలవరించకురా రైతన్నా !

ఆ కరువుకన్న...ఆ పరువుకన్న 

నీ ప్రాణం‌మిన్నని తెలుసుకోరా రైతన్న !

 

కరువులు వస్తే...రానియ్ గుండె చెరువవైతే...కానియ్

బ్రతుకుబరువైతే...కానియ్ కుంభవృష్టికురిస్తే...కురవనియ్

 

నీ ఆత్మ విశ్వాసం మాత్రం సడలనివ్వకు రైతన్నా అదే 

నీకు ఆయుధం...అదే నీకు ఆక్సిజన్...అదే నీకు శ్రీరామరక్ష...