Facebook Twitter
అవినీతి జింకలు

కవి పంచాంగం 

కమనీయం..‌ రమణీయం...

నిజమైన... స్వచ్చమైన... 

నిర్భయ కవిత అంటే ఇదండీ...

కవిత్వమంటే ఇదండీ...

అనుభవం సారమంటే ఇదండి... 

నిజానికి ప్రవచనాలు 

తారుమారు... తైలాలకోసం... 

పెద్దల మెప్పుకోసం...

మరి కవికేమి అవసరమో 

కలుషితమైన కవిత్వం రాయడానికి...

ఇలా పచ్చినిజాలతో... 

ఖచ్చితమైన... కవిత్వం వ్రాసే కవే..‌.

నిజమైన నిప్పులు గక్కేరవి... 

అవినీతి జింకలవెంట 

పులిలా పరిగెత్తే వాడే... నిజమైన కవి 

ఆ కవే అబద్ధాలను కప్పిపుచ్చక... 

సమాజ రుగ్మతలను రూపు మాపే 

నిఖార్సయిన వైద్యుడు ...