లక్షలు ఆర్జించి లాకర్లో పెట్టినా
కోట్లు ఆర్జించి కొంపలు కొట్టినా
తరతరాలకు తరగని
ఆస్తులు కూడబెట్టినా
అవి అన్నీ నీవేనని నీ భ్రమ
నిజానికి బూడిదలో
పోసిన పన్నీరే నీ శ్రమ కారణం
ఆ అంతర్యామి సందేశం ఒక్కటే
నీవు వస్తూ వట్టి చేతులతో వచ్చావు
కన్నుమూసి ఆ వట్టి చేతులతోనే
కట్టై కాటిలో కాలి బూడిదైపోతావు
చివరికి ఆ బూడిద కూడా నీదికాదు
పూచిక పుల్ల కూడా నీ వెంటరాదు
మరెందుకో ఈ భూమిపైన భుక్తి కోసం
ఇంతటి ఆరాటం ?ఇంతటి పోరాటం?
లాకర్లలో.... బ్యాంకు ఖాతాల్లో...
ప్లాట్లు రూపంలో... బాండ్లరూపంలో...
బంగారు ఆభరణాల రూపంలో...
విలాసవంతమైన విల్లాలరూపంలో...
స్థిర చరఆస్తుల రూపంలో... కోట్లు కోట్లు
మూలుగుతు వుండవచ్చు మీరు
ఆగర్భ శ్రీమంతులుగా కీర్తింపపడవచ్చు
ఐతే ధనవంతులందరూ...దాతలు కారు
కానీ దాతలందరూ
ధన్యజీవులే...పుణ్యమూర్తులే
నేడు ఇష్టముతో
నిరుపేదలకు ఇచ్చువారు...
రేపు ఆ పరమాత్మ నుండి
పుష్కలంగా పుచ్చుకుంటారు...
ఇది పచ్చినిజం ఎవరూ కాదనలేని నగ్నసత్యం



