Facebook Twitter
కరోనా కథచెబుతా…

ఊకొడతారా.....అనగనగా....
ఊహాన్ లోపుట్టిన కరోనా మహమ్మారి
ఊపిరితిత్తుల్లో చొరబడి
ఉక్కిరి బిక్కిరి చేస్తుంది
ఉలిక్కి పడేలా చేస్తుంది
ఊపిరాడకుండా చేస్తుంది
ఊపిరి తీస్తుంది
ఊర్లకు ఊర్లనే ఊడ్చేస్తుంది
ఉగ్రవాదిలా మారిన
ఉగ్రరూపం దాల్చిన
ఉన్మాదియైన ఈ కరోనా రక్కసిపైన
ఉక్కుపాదం మోపాలి ఒక్కటీకాతోనైైైన
ఉదృతమౌతున్న
ఉప్పెనలా విరుచుకుపడుతున్న
ఉపద్రవంలా మళ్ళీ ‌ముంచుకొచ్చే వేళ
ఉపాయం లేకున్న పెద్ద అపాయమే
ఉక్కు మనుషులను సైతం
ఉరుకులు పరుగులు పెట్టిస్తుంది
ఉరితీస్తుంది
ఉరుములా ఉరుముతుంది
ఊబిలోతోస్తుంది నిన్న
ఊహాన్ లో
ఉడుతలా పుట్టి, నేడు
ఊడలమర్రిలా విస్తరిస్తోంది
ఊహించని విధ్వంసాన్ని సృష్టిస్తోంది
ఉన్నోడిని, కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరున్ని
ఊరిచివర బిక్షగాన్నిఇద్దరినీ
ఉన్నపళంగా కాటేసి కాటికీడుస్తోంది కరోనా
ఉన్ననేమి విధ్వంసకర యుద్దవిమానాలు
ఉన్ననేమి మట్టికరిపించే మరఫిరంగులు
ఉన్ననేమి వేల క్షిపణులు, జలాంతర్గాములు
ఉన్ననేమి అగ్రరాజ్యాల వద్ద అణుబాంబులు
ఉప్పుకు కొరగాకున్నవి కరోనాముప్పును ఆపలేకున్నవి
ఉన్ననేమి అతిభయంకరులైన సాయుధ యుధ్ధవీరులు
ఉత్తరకుమారులయ్యారందరూ, అందుకే
ఉరితాళ్ళు సిద్ధం చేయండి ఆ కరోనా రక్కసిని 
ఉరితీసేద్దాం,ఇండియా గేటుకు వ్రేలాడతీసేద్దాం
ఊపిరితీసేద్దాం ఊరేగిద్దాం కరోనా డెెత్ డే
ఉత్సవం చేసుకుందాం