విషక్రిమినుండి విముక్తి ఎప్పుడు?
ఏడుకొండలవాడా ! ఓ వెంకటేశ్వరా !
మీ భక్తులమైన మేము
మిమ్మును కోరేదొక్కటే...
ఏడుకొండలు ఎక్కలేక...
ఏంచేయాలో దిక్కుతోచక...
మిమ్మల్ని దర్శించుకునే దారిలేక...
129 సంవత్సరాల అనంతరం
మీ గుడికి తాళాలేశానని తెగ
విర్రవీగుతూ మమ్మును వెక్కిరిస్తూ
గాఢాంధకారంలో ఓ గబ్బిలంలా
ఆ ఏడుకొండల్లో...కంటికి కనిపించక
నక్కినక్కితిరిగే ఈ కరోనా రక్కసికి...
గుండుచేసి కొండదేవతకు బలిచ్చేశక్తిని...
మాకు ప్రసాదించండి ఓ పరమేశ్వరా!



