Facebook Twitter
మూతపడనివి మూడు...

మృత్యువై 

తరుముకుంటూ  

వస్తున్నకరోనా 

నుండి కాపాడమని

ఇష్టదైవాలను 

వేడుకునేందుకు

ఎన్ని గుళ్ళు 

గోపురాలకు 

ఎన్ని చర్చీలకు

ఎన్ని మసీదులకు వెళ్ళినా 

అన్నీ మూతపడేవున్నాయి

లాక్ డౌన్ లో లాకైవున్నాయి

 

మూతపడ్డాయి,

మూతపడ్డాయి

కరోనాతో అన్నీ 

మూతపడ్డాయి

విద్యాలయాలు,

వినోదకేంద్రాలు, 

సినిమా హాల్స్, 

షాపింగ్ మాల్స్

హోటళ్ళు, 

రెస్టారెంట్లు, 

బార్లు,బస్సులు, 

రైళ్ళు, విమానాలు, 

తీరంలో షిప్పులు,

కిరాణా షాపులు 

గుళ్ళు, గోపురాలు, 

ప్రధానదేవాలయాలు

చర్చీలు, మసీదులు,

 

మూతపడనివి,

మూడే

బ్యాంకులు, 

హాస్పిటల్స్, 

స్మశానంలో సమాధులు...