Facebook Twitter
సెకండ్ వేవ్ కరోనాకిద్దాం కరెంటు ‌షాక్ .....

ఓసీ కంటికి కనిపించని ఓ కరోనారాక్షసి !

ఇన్నాళ్ళు మేము "ఇళ్ళల్లోనే" 

బంధీలై పోయిందెందుకో తెలుసా?

రామబాణాలు సిద్దం చేసుకోవడానికి

నీపై సంధించి నిన్ను బంధించడానికి 

నిన్ను పాతాళంలో పాతిపెట్టడానికి

 

ఇన్నాళ్ళు మేము" సెల్ఫ్ ఐసోలేషన్" లో 

వున్నదెందుకో తెలుసా?

స్టెన్ గన్ లు సిద్దం చేసుకోవడానికి

కనిపిస్తే నిన్ను కాల్చి పారెయ్యడానికి

 

ఇన్నాళ్ళు మేము "సెల్ఫ్ లాక్ డౌన్" ను

భరించిందెందుకో తెలుసా?

కనిపిస్తే నీకు "కరెంటు ‌షాక్ "ఇవ్వడానికి

 

మేము నిత్యం"ముఖాలకు మాస్కులు"

ధరించి తిరుగుతున్నదెందుకో తెలుసా?

కనిపిస్తే నీ ముఖానికి ముసుగు వేయడానికి

 

మేము నిత్యం" "భౌతిక దూరం"

పాటించే దెందుకో తెలుసా?

కత్తులు కటారులు నూరుకోవడానికి

కనిపిస్తే నీ తలనరికి నీ హాహాకారాలు విని

సంతోషంతో సంబరాలు చేసుకోవడానికి

 

మేము నిత్యం "సోపుతో చేతులు"

శుభ్రం చేసుకునేదెందుకో తెలుసా?

గండ్రగొడ్డళ్ళను పదును పెట్టడానికి

"సెకండ్ వేవని" వస్తే నిన్ను మట్టుపెట్టడానికి

 

ఓసీ కంటికి కనిపించని ఓ కరోనారాక్షసి !

మా డాక్టర్లింకా ప్రయోగశాలల్లో

మేధోమథనం చేస్తున్నదెందుకో తెలుసా?

త్వరలో నీకు"మందు'' కనిపెట్టడానికి

నీకు బొందపెట్టడానికి నీకు సమాధికట్టడానికి