Facebook Twitter
అణ్వస్త్రాలకై అన్వేషణ... 

కనిపించక కరుణించక

చాటుమాటుగా అందరిని 

కబళించి కసిగా కాటువేసి 

కాటికీడ్చే ఈ కరోనా రాక్షసి 

దాడిని ఎదుర్కోగలిగేది దీని 

దండయాత్రలను అపగలిగేది

అంతంచేయగలిగేది ఆ అదృశ్యదేవతలే 

కనిపించని ఆ దైవాలే అందించే అస్త్రాలే

 

ముల్లుకు ముల్లే శత్రువు 

ముల్లును ముల్లుతోనే తియ్యాలి

కనిపించని ఆ అతీంద్రియశక్తులే

కనిపించని ఈ అదృశ్యశక్తిని 

అంతంచేయాలి మానవాళిని రక్షించాలి

 

సముద్రగర్భంలో శతృవుల 

జలాంతర్గాముల్ని ఢీకొట్టినట్లు

భారీతిమింగలాలు చిన్నచేపల్ని

వెతికి వెంటాడి వేటాడినట్లు

పురుగుల్ని కప్పలు మింగేసినట్లు

ఆకప్పల్ని పాములు మింగేసినట్లు

ఆ పాముల్ని గద్దలు సంహరించినట్లు

 

విశ్వమంతా విస్తరించి "ఓ అభినవ

మృత్యువులా" మనుషుల్ని మ్రింగేస్తున్న

ఈ వింత విషక్రిమిని అంతంచేసే శక్తే

ఈ అనంత విశ్వంలో లేదా? అసంభవం

ఉండితీరాలి...విశ్వప్రయత్నం చేసైనా దాని 

ఉనికిని కనిపెట్టాలి కరోనాను మట్టుపెట్టాలి

 

ఓ మేధావులారా! పరిశోధకులారా! వైద్యులారా!

శాస్త్రజ్ఞులారా ! విజ్ఞాన వేత్తలారా! పరిశోధించండి!

అన్నిశాస్త్రాలను లోతుగా అధ్యయనం చేయండి ! ఈ

కరోనా రక్కసిని అంతంచేసే అణ్వస్త్రాలకై అన్వేషించండి!