గుర్తొస్తే...గుండె చెరువే...
నిన్న అక్కసు
కక్కిన ఈ కరోన రక్కసి
ఎందరి రెక్కలు విరిచిందో...
ఎందరిని గూడులేని
పక్షులను చేసిందో...
ఎందరి కళ్ళను
కన్నీటిసముద్రాలు మార్చిందో...
ఎందరి గుండెల్లో
గునపాలు గుచ్చిందో
ఎందర్నిగుండెలు పగిలేలా
రోధించే ఎలా చేసిందో...
ఎందరి బ్రతుకుల్ని
వేరులేని చెట్లగా మార్చిందో...
ఎన్ని పచ్చని జీవితాలకు
చిచ్చు పెట్టిందో...
ఎందరి బ్రతుకుల్లో
చితిమంటలు రేపిందో...
ఎందరిని నిర్దాక్షిణ్యంగా
శవాలుగా మార్చిందో
ఎందరికి శ్మశానానికి
దారి చూపిందో...
ఎందరి జీవితాలను
ముక్కలు ముక్కలు
చేసేసిందో లెక్కేలేదు...
గుర్తుచేసుకుంటే
గుండె చెరువే...బ్రతుకు బరువే...



